ప్రభు గారు 4రోజుల క్రితం జనరల్ మెడికల్ టెస్టులు చేయించుకున్నప్పుడు హార్ట్ లో 80% బ్లాకులు వున్నట్టు గుర్తించి వెంటనే యాంజియో గ్రామ్ చేసి బైపాస్ సర్జరీ చేయాలి అన్నారు. సెకండ్ ఒపీనియన్ కోసం చిరంజీవి గారిని సంప్రదించగా ఆయన వెంటనే స్టార్ హాస్పటల్ డాక్టర్స్ కు ఫోన్ చేసి అన్ని ఏర్పాట్లు చేయించి అడ్మిట్ చేయించినారు. డాక్టర్స్ కు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి కేర్ తీసుకున్నారు.
డా॥ రమేష్ గారి టీమ్ క్షుణ్ణంగా పరిశీలించి బైపాస్ చేయాల్సిన పని లేకుండా స్టంట్స్ మాత్రం వేసి ప్రాబ్లెమ్ క్లియర్ చేసారు. ఈరోజు డిచార్జ్ చేస్తున్నారు. ఎన్నోసార్లు మన జర్నలిస్ట్ అసోసిషియన్ వాళ్ళు వాళ్ళ యూనియన్ లో చేరి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్పినా ఫిలిం క్రిటిక్స్ అసోసిషియన్ లోనే కొనసాగుతూ ఈరోజు ఇన్సూరెన్స్ కూడా లేకపోవడం బాధాకర విషయం. మంచి వాళ్ళకు అంతా మంచే జరుగుతుంది. ప్రభు గారు ప్రాబ్లమ్ ను ముందే టెస్ట్ ల ద్వారా తెలుసుకొని పెద్ద ప్రమాదం నుండి బయట పడ్డారు. మీకు ఇక తిరుగులేదు. మళ్ళీ యంగ్ అయ్యారు. వారం విశ్రాంతి తరువాత మళ్లీ యంగ్ హీరోలా మాతోనే ఆసుపత్రిలో సింగిల్ పైసా కట్టనివ్వకుండా అన్ని తానై చూసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారికి కృతఙ్ఞతలు తెలుపకుండా ఉండలేకపోతున్నాను.
చిరంజీవి గారికి కృతజ్ఞతలు.

Leave a comment
Leave a comment