కొన్ని సంఘటనలు అలా యాదృచ్చికంగా జరుగుతుంటాయి అని అపిస్తుంది!
కానీ కొంచెం శ్రద్ధగా పరిశీలిస్తే ఒక దానితో ఇంకొకటి ముడి పడి ఉంటాయి!
- అమెరికన్ స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీ డోనాల్డ్ లు, దక్షిణ మరియు మధ్య ఆసియా వ్యవహారాలు ( Donald Lu, Assistant Secretary State for South and Central Asian Affairs) 5 రోజుల పర్యటన కోసం భారత్ , శ్రీలంక,బాంగ్లాదేశ్ పర్యటనకి వచ్చాడు.
- సరిగ్గా May,10 న కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చి విడుదల అయ్యాడు.
- May 9 న రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా (Maria Zakharova) అమెరికా భారత పార్లమెంట్ ఎన్నికలలో జోక్యం చేసుకుంటున్నది అని విమర్శించింది!
- డోనాల్డ్ లు భారత్ కి వచ్చే ముందే రష్యా ఆరోపణలు చేసింది అయితే జఖరోవా ఆరోపణల కి విలువ ఉంది!
ఎవరీ డోనాల్డ్ లు?
అమెరికా తరుపున దక్షిణ, మధ్య ఆసియా దేశాల లో ప్రభుత్వాలని అస్థిర పరిచే పనులు చేస్తుంటాడు!
పాకిస్ధాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వము పడిపోవడానికి, పెట్టీ కేసులలో జైలుకి వెళ్లి ఎన్నికలలో నేరుగా పాల్గొనకుండా చేయడంలో డోనాల్డ్ లు ప్రముఖ పాత్ర వహించాడు! పాకిస్ధాన్ కి డాలర్లు కావాలి కాబట్టి అమెరికా చెప్పినట్లు నడుచుకుంది. ఇది గత ఏడాది జరిగింది! అప్పట్లో డోనాల్డ్ లు పాకిస్ధాన్ పర్యటన తరువాతే ఇమ్రాన్ ఖాన్ పతనం మొదలయ్యింది!
అమెరికన్ జోక్!
మరియ జఖరోవా ఆరోపణల మీద అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందిస్తూ అమెరికా ఎప్పుడూ కూడా ఏ దేశ అంతర్గత ఎన్నికలలో జోక్యం చేసుకోలేదు. భారత్ లో జరుగుతున్న ఎన్నికలు ఆ దేశ ప్రజలు నిర్ణయిస్తారు అందులో మా ప్రమేయం ఏమీ ఉండదు అని ప్రతిస్పందించాడు. మరియా జాఖరోవా మరొక ఆరోపణ కూడా చేసింది. భారత రాజకీయాలలో అస్థిరత నెలకొల్పడానికి డోనాల్డ్ లు భారత పర్యటన చేయబోతున్నాడు అని.
నిజం కూడా అదే!
కేజ్రీవాల్ నిర్వాకం ను పరిశీలిస్తే డోనాల్డ్ లు రాకముందే ఏదో గూడు పుఠానీ జరిగింది!
డోనాల్డ్ లు మే 10 న భారత్ లో అడుగుపెట్టాడు. కేజ్రీవాల్ తీహార్ జైలు నుండి విడుదల అయిన గంటలోనే లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న సంజయ్ సింగ్ తో బహిరంగంగానే సమావేశం అయ్యాడు. ఇది బెయిల్ కండిషన్స్ ను ఉల్లంఘించడం అవుతుంది కానీ కేజ్రీవాల్ ఏ మాత్రం భయపడలేదు!
AAP రాజ్య సభ సభ్యురాలు స్వాతి మలీవాల్ ! బెయిల్ మీద బయటికి వచ్చిన కేజ్రీవాల్ ను కలవడానికి వెళ్ళింది స్వాతి మాలీవాల్! కేజ్రీవాల్ నివాసం లోని డ్రాయింగ్ రూమ్ లో కేజ్రీవాల్,భార్య సునీత, కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి ఆయిన బిబవ్ కుమార్ ఉన్నారు స్వాతి మలివాల్ వెళ్లిన సమయంలో ఏం జరిగిందో ఏమో కానీ కేజ్రీవాల్ PA బిబవ్ కుమార్ స్వాతి మలీవాల్ జుట్టు పట్టుకొని కొట్టాడు. అయితే స్వాతీ మలీవాల్ వెంటనే ఢిల్లీ పోలీసు కంట్రోల్ రూమ్ కి ఎమర్జెన్సీ కాల్స్ చేసింది రెండు సార్లు. కొద్ది సేపటి తరువాత ఢిల్లీ పోలీసులు కేజ్రీ వాల్ నివాసానికి వచ్చి స్వాతీమలీవాల్ ను తీసుకెళ్లారు. ఇది అన్ని ప్రధాన మీడియాలలో వచ్చిన కథనం! కానీ ఢిల్లీ లోని కొన్ని టాబ్లాయిడ్స్ మాత్రం కొంచెం ఎలాబొరేట్ చేసి వ్రాసాయి!
- స్వాతి మలీవాల్ తో కేజ్రీవాల్ కి చాలా కాలం నుండీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి రాజ్యసభ సీటు ఇచ్చాడు.
- స్వాతి మలీవాల్ తన భర్త నవీన్ జైహింద్ కి విడాకులు ఇచ్చింది. ఒంటరిగా ఉంటున్నది.
- సునీత కేజ్రీవాల్ కి స్వాతి మలీవాల్ అంటే ఇష్టం లేదు కాబట్టి బిబావ్ కుమార్ ను స్వాతి మీద దాడి చేయమని కోరింది!
- మరో కథనం ప్రకారం తాను (కేజ్రీవాల్) మనీ లాండరింగ్ కేసులో జైలుకి వెళ్ళిన తరువాత స్వాతి మలీవాల్ మౌనంగా ఉంది తప్పితే ఎలాంటి నిరసన తెలపలేదు APP రాజ్యసభ సభ్యురాలి హోదాలో.అదీ కాక బెయిల్ మీద బయటికి వచ్చిన రెండు రోజుల తరువాత కలవడానికి వచ్చింది అని కోపంతో కేజ్రీవాల్ తన PA బిబవ్ కుమార్ ను స్వాతి మీద దాడి చేయమని ఆదేశించాడు!
- ఇంకొక కథనం ఏమిటంటే కేజ్రీవాల్ జైలుకి వెళితే తన భార్య సునీత కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవకుండా స్వాతి మలీవాల్ పోటీకి రావొచ్చు అనే అనుమానం బలంగా ఉందని కాబట్టి దాడికి ఆదేశించాడు కేజ్రీవాల్!
- స్వాతి మాలివాల్ అంటే కేజ్రీవాల్ కి ఇష్టం లేదు అని AAP క్యాడర్ కి ఒక బలమయిన సందేశం ఇవ్వాలి అనే ఉద్దేశ్యం తో దాడి సంఘటన జరిగింది! ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో మరో ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కి తెలుసు కానీ మౌనంగా ఉండిపోయాడు ఎందుకంటే కేజ్రీవాల్ జైలుకి వెళితే ముఖ్యమంత్రి అవాలి అనే ఆశతో ఉన్నవాళ్లలో సంజయ్ సింగ్ కూడా ఉన్నాడు. అయితే Donald Lu భారత్ పర్యటనకి వచ్చే ముందే కొన్ని పథకాలు రచించ బడ్డాయి లేకపోతే చాల సున్నితమయిన బెయిల్ కండిషన్స్ మీద బయటికి వచ్చిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి తన పార్టీ రాజ్యసభ సభ్యురాలి మీద దాడికి దిగగలడా? తాను ఏం చేసినా జూన్ 2 వరకూ తనకి ఏమీ కాదు అనే భరోసా ఎక్కడి నుండి వచ్చింది? స్వాతి మలీవాల్ మాజీ భర్త నవీన్ జైహింద్ తన మాజీ భార్య అయిన స్వాతి మలీ వాల్ ప్రాణానకి ముప్పు ఉందని బహిరంగంగా ప్రకటించారు! ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు!
Donald Lu వచ్చే ముందు , వచ్చిన తరువాత జరిగిన కొన్ని ప్రచారాలు వాటి తాలూకు ప్రభావం ఏమిటో చూద్దామా?
- డోనాల్డ్ లు రాకముందు రాహుల్ చేసిన వ్యాఖ్య: బీజేపీ కి 180 సీట్లకు మించి రావు. కానీ తన పార్టీ కి ఎన్ని వస్తాయో చేప్పలేకపోయాడు.
8.4వ దశ ఎన్నికల తర్వాత కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య: బీజేపీ కి 220 కి మించి సీట్లు రావు. - రాహుల్ కి కేజ్రీవాల్ కి తేడా 40 సీట్లు.
- ఎవరు రాసిస్తే వీళ్ళు ఈ లెక్కలు చెబుతున్నారు?
- ఇక X (ట్విట్టర్) లో కూడా బిజేపి కి మెజారిటీ రాదు అని కేవలం 180 సీట్ల దగ్గర ఆగిపోతుంది అని ప్రచారం జోరుగా చేస్తున్నారు కానీ ఈ ప్రభావం ఫేస్బుక్ బిజేపి అభిమానులలో కొంచెం నిరాసక్తిని కలుగచేసిన మాట వాస్తవం!
- ఒక సిస్టమాటిక్ గా ఒక దాని తర్వాత ఇంకొకటి అనే విధంగా ప్రచారం చేస్తూ మానసికంగా దెబ్బ తీసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు!
- ఇదంతా ఏ ఒక్కరి వల్లనో సాధ్యం కాదు! విదేశాలలో ఉన్న థింక్ టాంక్ ల గ్రూపులు కలిసి రచించిన వ్యూహం! గత రెండు ఏళ్లుగా కష్ట పడి ఈ రోజున దానిని అమలు చేస్తున్నారు! కొంత వరకూ విజయం సాధించారు అని చెప్పుకోవచ్చు!
Donald Lu రాక ముందు వచ్చిన తరువాత!
భారత స్టాక్ మార్కెట్! ఈ నెల మొదటి వారంలో FDI (Foriegn Direct Investments) లు మన స్టాక్ మార్కెట్ నుండి పెట్టుబడులు ఉపసంహరించింది 33 వేల కోట్ల రూపాయలు. ఇది ఒక నెల మొత్తంలో జరిగిన చరిత్ర ఉన్న 35 వేల కోట్ల రూపాయల తో పోలిస్తే డోనాల్డ్ లు రాకముందే జరిగిన సంగతి! అంటే బీజేపీ ఓడిపోబుతున్నది అనే ప్రచారము చేసి మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసారు. వాస్తవానికి మళ్లీ పుంజుకున్నది అనుకోండి!
మోడీజీ చాల ఆత్మ విశ్వాసంతో ఉన్నారు. అదే మనకి శ్రీరామరక్ష! సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారం వలలో పడకుండా ఉంటే చాలు! బీజేపీ మళ్ళీ అధికారం లోకి వస్తుంది! మోడీ 3.0 లో చాలా వేగంగా,ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు!