1972 లో అమెరికా సౌదీ అరేబియా ల మధ్య పెట్రో డాలర్ ఒప్పందo కుదిరింది. ఒప్పందం ప్రకారం క్రూడ్ ఆయిల్ ను అమ్మడానికి, కొనడానికి కేవలం అమెరికన్ డాలర్ ను మాత్రమే వాడాలి. అయితే దీనివల్ల ఎక్కువ లాభపడ్డది సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్ దేశాలు మాత్రమే. అంతర్జాతీయంగా డాలర్ ఆధిపత్యానికి తెర తీసింది అనుకోవచ్చు ! అయితే 50 ఏళ్ల పాటు అమలులో ఉండే పెట్రో డాలర్ ఒప్పందం ఈ రోజుతో ముగిసిపోతుంది!
ప్రస్తుత సౌదీ రాజు పెట్రో డాలర్ ఒప్పందంను పొడిగించే ఉద్దేశ్యం లో లేడు!అమెరికా అద్యక్షుడు జో బీడెన్ తో సౌదీ రాజు కి ఉన్న అభిప్రాయ భేదాల వలన ఈ ఒప్పందం పొడిగింపు ఉండబోదు అని తెలుస్తున్నది!
రేపటి నుండి సౌదీ అరేబియా తన క్రూడ్ ఆయిల్ ను జపాన్ యెన్, చైనా RMB, EU యూరో లతో లావాదేవీలు జరపబోతున్నది. క్రూడ్ ఆయిల్ మీద అమెరికా డాలర్ ఆధిపత్యం పోవడం వలన అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణుల అభిప్రాయం! అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి అన్నిటి ధరలు పెరగవచ్చు . డీ డాలరైజేషన్ ప్రక్రియ మొదలయ్యి ఇప్పటికే దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతున్నది. ఓపేక్ దేశాలు ఇప్పటికే చైనా యువాన్ తొ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అందుకే చైనా తన డాలర్ రిజర్వ్ ను తగ్గించుకునే క్రమంలో అమెరికన్ ట్రెజరీ లో ఉన్న పెట్టుబడులను క్రమంగా అమ్మేస్తున్నది!
అమెరికా డాలర్ కి బదులుగా బంగారం ఇస్తుందా?
చైనా కి అమెరికా కి ఈ విషయంలో వివాదం మొదలయ్యే అవకాశం ఉంది! ఎందుకంటే డాలర్ కి బదులుగా ఎలాంటి ప్రత్యామ్నాయం ఉండదు. మన కరెన్సీ నోట్లు మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గ్యారంటీ ఉంటుంది అంటే రూపాయి చెల్లకపోతే ఆ విలువకి బంగారం ఇస్తుంది కానీ డాలర్ కి అలాంటి గ్యారంటీ ఏమీ ఉండదు! దాదాపుగా 3 ట్రిలియన్ డాలర్ల విలువ చేసే ట్రెజరీ బాండ్స్ లో చైనా పెట్టుబడులు ఉన్నాయి! డాలర్ విలువ పడిపోక ముందే ట్రెజరీ బాండ్స్ ను ఉపసంహరించుకుంటూ పోతున్నది చైనా! ఈ రోజు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ ఇటలీ దేశ పర్యటనకి వెళ్ళారు G7 దేశాల సదస్సులో పాల్గొనడానికి! భారత్ G7 సభ్య దేశం కాదు కానీ G7 సమ్మిట్ కి ఆతిధ్యం ఇస్తున్న ఇటలీ ప్రధాని జార్జియా మేలోనీ ప్రత్యేక ఆహ్వానం మీద మోడీజీ వెళ్ళారు! ఈ రోజుతో పెట్రో డాలర్ ఒప్పందం ముగియడం, ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జీ G7 సమ్మిట్ కి వెళ్ళడం మీద భారత్ ను G7 లోకి ఆహ్వానిస్తారా? వేచి చూడాల్సిందే!