ప్రధాని మోడీజీ అయితే పవన్ కళ్యాణ్ తూఫాన్ అని అనేశారు. కానీ కొంచెం అతిశయోక్తి ఉందేమో అనిపించింది నాకు! ఒకటికి పదిసార్లు జాతీయ మీడియా విశ్లేషణలు క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే మోడీజీ వ్యాఖ్య లో నిజం ఉందని నిర్ధారణ అయ్యింది! NDA కి వ్యతిరేకంగా ఏదన్నా దొరుకుతుందేమో అని నిత్యం రంధ్రాన్వేషణ చేసే రాజ్ దీప్ సర్దేశాయ్ విశ్లేషణ చూశాక ఎవరైనా ఒప్పుకోక తప్పదు! పార్లమెంట్, అసంబ్లీ ఎన్నికల సమయంలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రచారసరళి అంచనా వేయడానికి రాజ్దీప్ సర్దేశాయి ఆంధ్రాకి వచ్చినప్పుడు మొదట YSRCP కి ఎలాంటి స్పందన వస్తున్నది అని అంచనా వేయడానికి వచ్చాడు అనుకున్నాను. కానీ అనూహ్యంగా YSRCP కంటే పవన్ కళ్యాణ్ కోసం వచ్చిన జనసైనికుల భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నీ చూసి నాకు ఆశ్చర్యం కలిగింది అని వ్యాఖ్యానించాడు రాజ్ దీప్! నిజం చెప్పాలంటే రాజ్డీప్ ఇలాంటి వ్యాఖ్య చేసాడేమిటీ అని నేనూ ఆశ్చర్య పోయాను. మొదటిసారిగా రాజ్ దీప్ పవన్ ర్యాలీ విజువల్స్ చూపిస్తూ ఇలాంటి స్పందన నాకు దేశంలోని ఏ రాజకీయ నాయకుడి సభలో నేను (నిజానికి అది పవన్ కళ్యాణ్ ర్యాలీ) చూడలేదు అని అన్నాడు!
కానీ పవన్ కళ్యాణ్ ర్యాలీ లేదా సభలకి స్వచ్చందంగా ప్రజలు రావడం తీరా ఎన్నికలప్పుడు ఓట్లు వేయకపోవడం మనకి అనుభవం కదా? బహుశా రాజ్ దీప్ సర్దేసాయ్ కి ఈ విషయం గురించి తెలిసిఉండకపోవచ్చు అనుకున్నాను! నిజానికి జాతీయ మీడియా కి దక్షిణాది రాష్ట్రాల మీద ఆసక్తి తక్కువ అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రా మీద అసలు దృష్టి పెట్టడంలేదు గత దశాబ్ద కాలంగా! తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ చానెళ్లు ఉన్నాయి అని ప్రాముఖ్యత ఇవ్వట్లేదు అని అనుకుంటే పొరపాటే! అసలు దక్షిణాది రాష్ట్రాల మీద ఆసక్తి తక్కువ ఒక్క బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ లని తప్పిస్తే!
కానీ ఈ సారి పవన్ కళ్యాణ్ మీద ఫొకస్ ఎక్కువ పెట్టాయి జాతీయ మీడియా! ఇది వాళ్ళ దృష్టిని ఆకర్షించింది ఏమిటంటే పవన్ కళ్యాణ్ మధ్యర్థిత్వం వల్ల బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పాటు అనే అంశం! కానీ ఎన్నికలు అయిపోయి ఫలితాల మీద సరైన వివరాలు ఇవ్వలేక పోయాయి అంటే ఈ సారిమాత్రం ఆంధ్రా ప్రజల మనోగతం ఏమిటో ఎవరూ పసిగట్ట లేకపోయారు! అంత గుంభనంగా ఉండిపోయారు ఓటర్లు! ఫలితాలు వచ్చిన రోజున మాత్రం అందరికీ ఆశ్చర్యమే! ఎన్నికలకి రెండు రోజుల ముందు హైదరాబాద్ ఖాళీ అయ్యేంతగా ప్రజలు ఆంధ్రాకు వెళ్ళడం అనేది నాలుగు దశాబ్దాలలో ఇదే మొదటిసారి! సంక్రాంతికి వెళ్ళడం మామూలే కానీ ఎన్నికల కోసం జనాలు అంతలా వెళ్ళడం ఇదే మొదటిసారి! కానీ ఎవరికి ఓటు వేశారు అనేది సస్పెన్స్! చివరికి తెలిసిపోయింది అనుకోండి!
ఆడలేక మద్దెల వోడు! ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించాల్సిందే ఎవరైనా! అంతే కానీ EVM ల మీద నెపం నెట్టడం అవివేకం! జగన్ కి ఇంకా చిన్నతనం పోలేదు. సైకో అనే పదం నేను వాడను. 2019 లో ఇదే జగన్ కి భారీ మెజారిటీ ఇచ్చినప్పుడు EVM లు బాగా పనిచేసాయ? ప్రజలు ఎందుకు హైదరాబాద్ నుండి భారీగా తరలివచ్చి కసిగా ఓట్లు వేశారు? ఎవరిని ఓడించడానికి? రాజకీయం చేసే వాడికి సుళువు గా అర్ధం అవుతుంది! దురంహాకారికి అర్ధం కాదు. జగన్ వ్యవహార శైలి ను చూస్తే మితిమీరిన అహంకారం అనిపిస్తుంది! ‘ చెడు చేసి ఓడిపోతే బాధపడాలి కానీ మంచి చేసి ఓడిపోతే బాధపడకూడదు ‘. ఎంటా మంచి? ప్రభుత్వ ఆస్థులని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి పప్పు బెల్లాల లాగా పంచడమా? భారతీ సిమెంట్స్ అమ్మి ప్రజలకి పంచితే అది మంచి! చీప్ లిక్కర్ ను ప్రీమియం రేట్లకి అమ్మి బినామీ పేర్లతో దాచుకోవడం మంచా? కాష్ అండ్ కారీ ఎందుకు? UPI ద్వారా అన్ని రాష్ట్రాలలో లిక్కర్ అమ్ముతుంటే ఒక్క ఆంధ్రా లోనే నగదు చెల్లింపుల ద్వారా అమ్మడం అదీ చీప్ లిక్కర్ ను ప్రీమియం ధరలలో దేనికోసం? ఎవరి మంచి కోసం? సరే! వీటన్నిటినీ పక్కన పెడదాం! వేంకటేశ్వర స్వామి జోలికి పోతే ఏమవుతుందో తెలిసీ తిరుమలని భ్రష్టు పట్టించడానికి చేయని ప్రయత్నం లేదు! స్వామి వారి ప్రసాదం టిష్యూ పేపర్ తో సమానంగా ఎప్పుడయితే చూసాడో అప్పుడే జగన్ తన పతనానికి నాంది పలికాడు స్వయముగాతనకి తానే ! తప్పు చేసి ఎదుటి పక్షానికి అవకాశం ఇచ్చి EVM ల మీద పడి ఏడవడం ఎందుకు? పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఓడినా EVM ల మీద నెపం వేయలేదు. హుందాగా తన ఓటమిని ఒప్పుకోవడమే కాదు ధైర్యంగా ప్రజల మధ్యలోనే ఉంటూ వచ్చాడు.
మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీకి మంచిరోజులు వచ్చినట్లేనా?
ఆ సంగతి తెలియాలి అంటే మరో ఆరు నెలలు ఆగాలి!
కానీ పవన్ కళ్యాణ్ రూపంలో ఒక మంచి అడుగు పడింది అని చెప్పగలను!
పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష!
ఈ రోజు నుండి వారాహి అమ్మవారి 11 రోజుల దీక్షని ఆచరిస్తున్నాడు పవన్ కళ్యాణ్!
11 రోజుల దీక్షలో భాగంగా పాలు, పండ్లు, ద్రవాలు తప్పితే వేరే ఏ ఆహారం తీసుకోడు పవన్ కళ్యాణ్!
పోయిన సంవత్సరం కూడా వారాహి దీక్షని ఆచరించాడు పవన్ కల్యాణ్!
ఇలా వారాహి దీక్ష తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుందా?
ఎవరి విశ్వాసం వారిది!
ఉప ముఖ్యమంత్రి గా ఉన్న పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష తీసుకోవడం శుభ సూచకంగా భావిస్తున్నాను!