1960 ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్ లో ప్రముఖనటుడు అక్కీనేని నాగేశ్వరరావు గారికి పౌరసన్మానం జరుగుతుంది. అక్కినేనిగారికి బ్రహ్మరథం పడుతున్నారు జనం.. ఆ కోలాహలం చూసి తనూ సినీ యాక్టర్ అయి జనాలచేత ఇలాగే గుర్తింపు తెచ్చుకోవాలను కున్నాడు ఆ కాలేజ్ లో బియస్సీ డిగ్రీ చదువుతున్న ఘట్టమనేని శివరామక్రిష్ణమూర్తి అనే యువకుడు.
అనుకున్నదే తడువుగా మద్రాసు బయలుదేరాడు.. అప్పటికే తెనాలి వాస్తవ్యులైన గుమ్మడి, జగ్గయ్య లాంటివారు సినిమాలలో గుర్తింపు తెచ్చుకొని వున్నారు. వారిని కలిసాడు ఆ యువకుడు…నీకు వయస్సు తక్కువనీ, ఇంకో రెండు సంవత్సరాలు ఆగి రమ్మని సలహా ఇచ్చారు వారు. మళ్ళీ తెనాలి వచ్చిన అతను ప్రజానాట్యమండలిలో చేరి నాటకాలు ,జానపద నృత్యం చేయడం మొదలు పెట్టాడు..ఇంతలో యల్ వి ప్రసాద్ తనయుడు ఆనందరావు “కొడుకులు-కోడళ్ళు” సినిమా తీస్తూ కృష్ణమూర్తి గారికి కబురు పంపారు..స్క్రీనింగ్ టెస్ట్ అయిన తరువాత ఒక పాత్ర కు ఆయనను ఎంపిక చేశారు.. కొద్దిరోజులు జరిగిన షూటింగ్ జరిగి ఎందుకనో ఆగిపోయింది… జగ్గయ్య గారు పదండి ముందుకు అనే సినిమాలో చిన్నపాత్ర ఇచ్చారు..తర్వాత కులగోత్రాలు అనే సినిమాలో చిన్నపాత్రలో నటించాడు..అయినా గుర్తింపు రాలేదు.
1964 లో ఆదుర్తి సుబ్బారావుగారు “తేనెమనసులు” సినిమా తీస్తూ కృష్ణమూర్తికి ఆఫర్ ఇచ్చాడు. విశ్వనాథ్ దగ్గర డైలాగ్స్ , హీరాలాల్ దగ్గర నత్యం శిక్షణలు ఇప్పించాడు ఆదుర్తి.. కృష్ణమూర్తి – కృష్ణ అయ్యాడు… తేనెమనసులు 100 రోజులాడింది. అయినా కృష్ణగారికి సినిమాలు రాలేదు…మద్రాసులో శోభన్ బాబు గారితో కలిసి నాటకాలు వేయసాగాడు.
1965లో డూండేశ్వరరావు దర్శకత్వంలో “గూఢాచారి 116 ” సినిమాలో హీరోగా అగ్రిమెంట్ కుదిరింది…ఇదే మొదటి జేమ్స్ బాండ్ సినిమా.. తెలుగులో.. 1966లో రిలీజ్ అయిన ఈ సినిమా కృష్ణగారి చరిత్రనే మార్చేసింది. ఆంథ్రా జేమ్స్ బాండ్ గా పేరు తెచ్చింది..అలాగే మొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్ళకు మోసగాడు సినిమాతో కృష్ణగారు యాక్షన్ హీరోగా స్థిరపడిపోయారు.. రోజుకి 16 గంటలు షూటింగ్ లోనే గడిపేవారు ఆయన.. 1969_72 లో ఏకాకంగా 62 సినిమాలలో నటించి రికార్డ్ సృష్టించారు కృష్ణగారు.
మొదటి ఈస్ట్ మన్ కలర్ , మొదటి సినీస్కోప్ , మొదటి 70Mm చిత్రాలలోనటించిన ఘనత వీరిదే.. ఆంథ్రప్రదేశ్ లో అత్యథిక అభిమాన సంఘాలున్న హీరో కూడా ఇతనే “అల్లూరి సీతారామరాజు” తెలుగు సినీచరిత్రలోనే ఒక గొప్పసినిమా గా నిలిచిపోయింది. 1962నుండి 2012 వరకు అప్రహితంగా సినీపరిశ్రమలో కృష్ణగారు.
1965 లో ఇందిరా గారితో మొదటి వివాహం,1969లో విజయనిర్శలగారితో రెండో వివాహం జరిగింది. ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు. కృష్ణగారు స్వతహాగా చాలా మంచి హృదయం గలవారు. ప్రకృతి వైపరిత్యాలు జరిగినప్పుడు సినీపరిశ్రమలో మొదట స్పందించేది కృష్ణగారే. ఎంతో మంది కళాకారులకు చేయూతనిచ్చారు.. నిర్మాతలు పారితోషికం ఎగగొట్టినా ఏమీ అనేవారుకాదు దర్శకులను ఇబ్బందిపెట్టి ఎరగరు మంచి క్రమశిక్షణ కలవారు..1989లో ఏలూరు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు.
కృష్ణ గారు కార్డియాక్ అరెస్ట్‌తో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ 2022 నవంబరు 15న ఆరోగ్యం విషమించడంతో మరణించారు.