చంద్రబాబు కేబినెట్ లో పవన్ కల్యాణ్ కు ఉమముఖ్యమంత్రి పదవితో పాటు కీలక శాఖలు కేటాయించే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆయనకు అత్యంత కీలకమైన పంచాయతీరాజ్ శాఖతో పాటు అటవీ పర్యావరణ శాఖలను కూడా అప్పగించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
ఇక కేబినెట్ లో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు కూడా చంద్రబాబు స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. ఆయనకు పౌరసరఫరాలు, అలాగే జనసేన నుంచి చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కించుకున్న కందుల దుర్గేష్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫి శాఖలు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. కాగా ఈ ముగ్గురూ కూడా తొలి సారిగా మంత్రి పదవులు చేపట్టబోతున్న వారే కావడం విశేషం