మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (ram charan)కొన్ని నెలల క్రితం జరిగిన ఎన్టీఆర్ (ntr)శత జయంతి ఉత్సవాలకి హాజరయ్యాడు. ఆ సందర్భంగా చరణ్ చేసిన స్పీచ్ అందర్నీ ఆకట్టుకుంది. తెలుగు సినిమా ,తెలుగు వారు ఉన్నంత కాలం ఎన్టీఆర్ అనే పేరు బతికే ఉంటుంది. ఎన్టీఆర్ గారు నడిచిన తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను కూడా ఉండటం గర్వకారణంగా ఉందని చెప్పాడు. అలాగే తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (chandrababu naidu)ని ఉద్దేశించి మా చంద్రబాబు నాయుడు అని అన్నాడు. ఆ మాటకి ఇప్పుడు గౌరవం దక్కనుంది.
ఈ నెల పన్నెండవ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరుకాబోతున్నాడు. దీన్ని బట్టి చరణ్ కి చంద్ర బాబు నాయుడు గారు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో అర్ధం అవుతుంది. అదే విధంగా చరణ్ ఏం మాట్లాడతాడో అనే ఆసక్తి కూడా అందరిలో ఉంది. చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్(pawan kalyan) చంద్రబాబు నాయుడు తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించిన విషయం అందరకి తెలిసిందే. ఒకే స్టేజ్ మీద బాబాయ్ అబ్బాయి ని చూసి మెగా ఫాన్స్ అయితే మురిసిపోవడం ఖాయం.
చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ (game changer)షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. ఇటీవల మరణించిన రామోజీ రావు (ramoji rao) గారి మరణానికి సంతాపంగా ఒక రోజు షూటింగ్ ని కూడా ఆపారు. ఇక చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారోత్సవానికి చరణ్ హాజరవుతున్నాడనే న్యూస్ తో సినీ అండ్ రాజకీయ వర్గాల్లో ఇంకో వ్యక్తి గురించి కూడా చర్చకు వస్తుంది. అతనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరి ఎన్టీఆర్ హాజరవుతాడా లేదో చూడాలి. చరణ్ ,ఎన్టీఆర్ లు ప్రాణ స్నేహితులనే విషయం అందరకి తెలిసిందే. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమం గన్నవరం ఎయిర్ పోర్ట్ దగ్గరలోని కేసనపల్లి ఐటి పార్క్ దగ్గర జరగనుంది.