హైదరాబాద్ ఎన్నికల ముఖ చిత్రం కి మొదటిసారిగా దేశ వ్యాప్తంగా ప్రాముఖ్యత వచ్చింది!
ఎవరు ఎక్కడ గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? దీని మీద ఆసక్తి చూపడం అనేది కొద్ది చోట్ల మాత్రమే ఉంటుంది. వేనాడ్, రాయ్ బరెలీ,హైదరాబాద్,కోయంబత్తూరు ల మీద ఎక్కువ ఆసక్తి ఉంది ఈసారి. అయితే మొత్తంగా చూస్తే హైదరాబాద్ మీదనే దేశవ్యాప్తంగా ఎక్కువ ఆసక్తి ఉంది. ఎందుకంటే మొదటి సారిగా ఒవైసీ ను భయపెట్టే ప్రత్యర్థి ను అభ్యర్థి గా బిజేపి నిలబెట్టింది. అసలు మాధవీ లత గారిని ఒవైసీ మీద పోటీగా దించుతారు అని ఎవరూ ఏమాత్రం ఊహించలేదు ! కానీ ముందుగా హోమ్ వర్క్ చేసి మరీ మాధవీ లత గారిని పోటీకి దించడం అనేది సగం విజయం సాధించే చర్యగా భావించాల్సి ఉంటుంది!
- 5లక్షల 40 వేల దొంగ ఓట్లని తొలగించడం అనేది ఒక రికార్డ్!
- తన పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 5.4 లక్షల ఓటర్లని తొలగించడం మీద ఒవైసీ ఎలాంటి ప్రతి చర్య కి దిగలేక పోవడం అనేది అతని భయాన్ని సూచిస్తున్నది!
- అదే సమయంలో మాధవీ లత గారి హై ఓల్టేజ్ ప్రచారం చేయడం ప్రజలు కూడా భారీగా ఆమె ప్రచారానికి రావడం అనేది మార్పుకి సూచన!
- ముఖ్యంగా పాత బస్తీ లో ఎక్కువమంది చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఉన్నారు కానీ వీళ్ళు మాధవీ లత గారి ప్రసంగం వినడానికి వాళ్ళు వ్యాపారాలు, ఉద్యోగాలకి శెలవు పెట్టీ మరీ వస్తున్నారు. ఇది చదవడానికి, వినడానికి కొంచెం అతిశయోక్తి గా ఉండవచ్చు కానీ నిజం! ఎంత భయం లేకపోతే ఒవైసీ కాషాయ తలపాగా ధరించగలరు? పత్రికా విలేఖరుల ఇచ్చే సమాచారం కంటే ఒవైసీ అనుచరులు ఇచ్చే క్షేత్ర స్థాయి సమాచారం ఖచ్చితంగా ఉంటుంది! దశాబ్దాలుగా ఒవైసీ అనుచరులు అక్కడ పాతుకుపోయారు అన్నదీ నిజమే! కనుకనే ఒవైసీ మొదటి సారిగా భయపడుతున్నాడు! పైగా దొంగ ఓట్లు పడే అవకాశం ఉండదు. ఉత్తర ప్రదేశ్ తరహా బూత్ పోలింగ్ మేనేజ్మెంట్ ను అమలూచేస్తున్నది బీజేపీ. మూడో దశ ఎన్నికల సందర్భంగా ఉత్తర ప్రదేశ్ లో ఒక పోలింగ్ బూత్ లో మైనర్ ముస్లిం బాలిక నీ పట్టుకున్నారు బీజేపీ పోలింగ్ ఏజెంట్లు. 40 ఏళ్ల ముస్లిం మహిళ కి బదులుగా 15 ఏళ్ల బాలిక ఓటు వేయడానికి వచ్చినప్పుడు గుర్తించి పట్టుకున్నారు. విచారణలో ప్రిసైడింగ్ ఆఫీసర్ సూచన మేరకు ఆ బాలిక ఓటు వేయడానికి వచ్చినట్లు చెప్పింది. పోలీసులు ప్రిసైడింగ్ ఆఫీసర్ మీద కేసు నమోదు చేశారు! అయితే హైదరాబాద్ లో కూడా ఇదే తరహాలో జరిగి తీరుతుంది! బిజెపి పోలింగ్ బూత్ ఏజెంట్లు ఎంత జాగ్రత్తగా ఉంటారు అన్నదానిమీదనే బీజేపీ గెలుపు ఓటములు నిర్ధారించబడతాయి! ఓవైసీ ఓడిపోవడానికి రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి.
- ఓవైసీ ను సామాన్య ప్రజలు కలవాలి అంటే అతని గూండా అనుచరులను కలవాలి. వాళ్లకి ఇష్టం ఉన్నవాళ్ళని మాత్రమే ఒవైసీ తో ములాఖాత్ ఉంటుంది.
- ముస్లిం లలోనే ఒవైసీ అంటే తీవ్ర వ్యతిరేకత ఉన్న వర్గం ఉంది ఇక మాధవీ లత గారి విషయానికి వస్తె ముస్లిం మహిళలలో సానుకూల దృక్పథం ఉంది. ఎటూ దొంగ ఓట్లు లేవుకాబట్టి 2% శాతం ముస్లిం మహిళా ఓట్లు పడినా గెలుపు ఖాయం! ఎటూ ఒవైసీ వ్యతిరేక వర్గం కి తాము గెలవమని తెలుసు కాబట్టి ఈ సారి బీజేపీ కి ఓట్లు వేసి ఒవైసీ ను గెలవకుండ చూడాలని పట్టుదలతో ఉన్నారు!