వయసు అయిపోయింది అన్నారు…
రాజకీయం చేతకాదు అన్నారు …
కక్ష సాదింపు రాజకీయాలు చేయలేదు అన్నారు …
సమర్దతకు ప్రాంతం,కులం రంగు పుయాలి అని చూసారు …
కొడుకుని అసమర్దుడి గా చిత్రీకరించే ప్రయత్నం చేసారు …
కబంద హస్తాలు నుండి పార్టీ ని రక్షించే క్రమంలో , అన్న గారికి వెన్నుపోటు పొడిచారు అనే నింద మోపారు …
జైల్లో పెట్టి మానసిక క్షోభ పెట్టాలి అని చూసారు…
లేకి మనుషులు , ‘పశువులు’, social media చీడ పురుగులు చేత నోటికి వచ్చిన బూతులు తిట్టించారు …నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనిపించారు …
ప్రాణసమానమైన కార్యకర్తల ప్రాణాలు నడిరోడ్డు మీద తీశారు …
అయినా నిలబడ్డాడు … పోరాడాడు .. తను నమ్మిన రాజకీయ విలువలు కోసం , తన ప్రజల శ్రేయస్సు కోసం …
ఎంతో మంది నాయకులు వచ్చారు , పోయారు … తోపులం తురుములం అన్నారు … కాలగర్భంలో కలిసిపోయారు…
అక్కడ ఉంది బాబు సంకల్పం… చెరిపేస్తే చెరిగిపోదు ఆ చరిత్ర …
మాకు ఆదర్శం , తండ్రి లాంటి వారు మా బాబు గారు …
.
ప్రయత్నం…!
అవకాశాలు వాటికవే రావు,
నీవే వాటిని సృష్టించుకోవాలి”
వేసే ప్రతి అడుగు..
గడిపే ప్రతి ఘడియ..
పలికే ప్రతి పలుకు..
చేసే ప్రతి చర్య..
ఆలోచన అనే ఆయుధంతో, నీ శ్రమను నమ్ముకుని సంకల్పంతో ముందుకు వెళ్ళు…
నీకు నాలుగు గోడలే కనిపిస్తే బానిసత్వం”
అదే నాలుగు దిక్కులు కనిపిస్తే స్వాతంత్రం”
జీవితం నేర్పింది ఒక్కటే”
దేనికి ఎదురు చూడవద్దని…
ఎవరి మీద ఆధారపడవద్దని…
నీకు నువ్వే తోడని…
ఆత్మవిశ్వాసంతో నువ్వు వేసే ప్రతి అడుగు
నీ విజయానికి తొలిమెట్టు..
CONGRATULATIONS BABU garu…
.
నేను సంవత్సరం పొడుగునా రాజకీయాల గురించి మాట్లాడను. నా ప్రపంచం, నా ప్రయారిటీస్ వేరు. అయితే అప్పుడప్పుడు కచ్చితంగా మాట్లాడటం అత్యంత ముఖ్యమని నా హృదయానికి అనిపిస్తే నిర్మొహమాటంగా, నిర్భయంగా మాట్లాడతాను. నా దృష్టిలో భయమే మనిషికి అత్యంత పెద్ద శత్రువు. ఎవరి గురించి భయపడాలి, దేని గురించి భయపడాలి? భావవ్యక్తీకరణను ఎందుకు అణిచి వేసుకోవాలి? ఎస్ నచ్చని వాళ్ళు కొంతమంది దూరమవుతారు. వాళ్లకి కావలసింది నా నాలెడ్జ్ కాకుండా వాళ్లకి నచ్చినట్లు నేను మాట్లాడడం అయితే హ్యాపీగా వెళ్ళిపోతారు. అది వాళ్ళ ఛాయిస్.
ఈరోజు కొత్త కాదు నేను గత 12 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో ఇంతే అలాగేగా ఉంటున్నాను, ఎపిసోడ్ ముగిసిపోయిన తర్వాత మళ్లీ అంతే ప్రశాంతంగా నా మెడిటేషన్ చేసుకుంటూ, నా పనుల్లో నిమగ్నమైపోతుంటాను తామరాకు మీద నీటి బొట్టులా!! నా క్లారిటీ నాకుంది ఒక రకంగా చెప్పాలంటే నేను షేర్ చేసే నాలెడ్జ్ కి ఎంతమంది కనెక్ట్ అయి నా పట్ల గౌరవం కలిగి ఉండి కొనసాగుతుంటారో టెస్టు చేయడానికి కూడా కొన్నిసార్లు సున్నితమైన విషయాల గురించి రాస్తుంటాను. అంటే క్లీనింగ్ మెకానిజం అన్నమాట వజ్రం ‘ వజ్రం ‘ అని తెలుసుకోవాలంటే, అసలు ‘ వజ్రం ‘ అంటే ఏమిటో, ఎలావుంటుందో తెలియాలి. ఇంతకంటే వ్రాయాల్సిన పనివున్నదా మన తెలుగు ‘ వజ్రం ‘ CBN గురించి.