యంగ్ టైగర్ ఎన్టీఆర్ (ntr) ఫ్యాన్స్ తమ ఇళ్లలోని క్యాలెండర్ల లో ఆక్టోబర్ పది డేట్ ని పెన్ తో రౌండ్ అప్ చేసారు. మూవీ లవర్స్ కూడా చేశారనుకోండి. కాకపోతే ఫ్యాన్స్ అంతకు మించి కద..ప్రస్థుతానికి అయితే దేవర (devara)ముందు నువ్వెంత అనే ఫియర్ సాంగ్ ని డైలీ వింటు మూవీ ఎలా ఉండబోతుందో అంటు ఉహించుకుంటున్నారు. పైగా పాన్ ఇండియా లెవల్లో ఆ సాంగ్ సక్సెస్ కావడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. దీంతో ఈ సారి ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవల్లో సృష్టించే రికార్డుల గురించి లెక్కలు వేస్తున్నారు . ఈ క్రమంలో దేవర కి పాన్ ఇండియా లెవల్లోనే ఒక మూవీ గట్టి పోటీ ఇవ్వబోతుందనే వార్త ఫ్యాన్స్ దృష్టికి వచ్చింది
ధృవ సర్జా(druva sarja)కన్నడ సినీ రంగంలో తిరుగులేని సూపర్ స్టార్. 2012 లో వచ్చిన ఆదూరి తన ఫస్ట్ మూవీ. ఆ తర్వాత బహాదుర్, బర్జరి, పొగరు లాంటి సినిమాలు చేసాడు. పొగరు మూవీ తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. స్టార్ హీరోయిన్ రష్మిక అందులో హీరోయిన్ గా చేసింది. దీంతో ధృవ పాన్ ఇండియా లెవల్లోనే మంచి గుర్తింపుని పొందాడు.ఇప్పుడు లేటెస్ట్ గా మార్టిన్ అనే మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఇప్పుడు ఈ మూవీనే ఎన్టీఆర్ దేవర కి పోటీగా రాబోతుంది. దేవర ఆక్టోబర్ పది న రిలీజ్ అవుతుండగా మార్టిన్ పదకొండు న విడుదల కానుంది. కన్నడ లాంగ్వేజ్ తో పాటు పాన్ ఇండియా లెవల్లో భారతీయ ప్రధాన భాషల్లోను రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న మార్టిన్ కి ఏ.పీ. అర్జున్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన గతంలో మూడు సినిమాలకి దర్శకత్వం వహించాడు. అన్ని కూడా వంద రోజులని పూర్తి చేసుకున్నాయి.
వాస్తవానికి ఎన్టీఆర్ కి ధ్రువ కి మధ్య తెలుగు నాటతో పాటు దక్షిణాదిన ఎలాంటి పోటీ ఉండకపోయినా నార్త్ లో మాత్రం థియేటర్స్ విషయంలో పోటీ వచ్చే అవకాశం ఉంది. రెండు కూడా యాక్షన్ సినిమాలే కావడంతో ఆ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మార్టిన్ టీం దేవర ఫియర్ సాంగ్ ఒక సారి వినాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ సాంగ్ లో ఎన్టీఆర్ రేంజ్ ఏంటో స్పష్టంగా అర్ధమవుతుంది. పైగా ఇలాంటి పోటీలని ఎన్టీఆర్ తన నూనూగు మీసాల వయసులోనే చూశాడని. వాటన్నింటిలో విజయాలు సాధించే పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడని అంటున్నారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తున్న దేవర ని ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధ ఆర్ట్స్ లు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా చేస్తుండగా జైలర్ తో అగ్ర సంగీత దర్శకుడు గా మారిన అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కొరటాల శివ దర్శకుడు. జనతా గ్యారేజ్ తర్వాత ఆ ఇద్దరి కాంబో లో వస్తున్న మూవీ దేవరనే.