నటనే కమల్ హాసన్ (kamal haasan) దగ్గర నటన నేర్చుకుందనే నానుడి సినీ ప్రేక్షకుల్లో ఉంది. అంతటి కీర్తిని సంపాదించిన నాలుగున్నర దశాబ్దాలకి పైగా ఎన్నో సినిమాల్లో విభీమన్నమైన పాత్రలని పోషిస్తూ అలరిస్తు వస్తున్నారు. కమల్ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan)గురించి మాట్లాడిన మాటలు టాక్ అఫ్ ది డే గా నిలిచాయి.
ఇటీవల జరిగిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ (pawan kalyan)ఘన విజయం సాధించిన విషయం అందరకి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కమల్ ఒక ట్వీట్ చేసాడు. నిన్ను చూసి గర్వపడుతున్నాను తమ్ముడు..మున్ముందు నువ్వు రాజకీయ జీవితంలో మరెన్నో శిఖరాలని అధిరోహించాలి.సేవ చెయ్యడానికి రాజకీయాల్లో కి వచ్చిన నువ్వు ఈ ప్రయాణంలో విజయం సాదించాలి.ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలి అని కొనియాడాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఆసక్తి కరంగా మారింది.
ఇక కమల్ కూడా మక్కల్ నీది మయ్యాం అనే రాజకీయ పార్టీ స్థాపించాడు. 2019 లోక్ సభ ఎన్నికల్లో, 2021 అసెంబ్లీ ఎన్నిలల్లో పోటీ చేసాడు. కానీ ఒక్క సీట్ కూడా దక్కించుకోలేదు. స్వయంగా కమల్ హాసన్ కూడా ఓడిపోయాడు. ప్రస్తుతం భారతీయుడు 2 , కల్కి 2898 ఏ డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.