ఈ ఎన్నికలలో నాకు తీరని వ్యధ కలిగించినవి మూడు అంశాలు. బీజేపీ కి 240 సీట్స్ మాత్రమే రావటం, మాధవి లత గారూ అన్నామలై గారూ స్మృతి ఇరానీ ఓడిపోవటం పార్లమెంట్ లో ఇక ప్రజల సౌకర్యం కోసం ఏదైనా ఒక బిల్లు పెట్టినా దానిని అరుపులు కేకలు మధ్య వీటో చేయటం హిందువులకు తమ సంస్కృతి హెరిడీటీ ధర్మం మతం మీద ఎలాంటి ప్రేమ గౌరవం లేనేలేవు. వుంటే బీజేపీ కి 400సీట్లు తప్పక వచ్చేవి.
తమ పూర్వచరిత్ర నాగరికత తమ సనాతన ధర్మంమీద ఏమాత్రం గౌరవం లేని వారికీ భవిష్యత్తు ఉండదు అనే జ్ఞానం కూడా లేని సెక్యూలర్ హిందువుల అజ్ఞానం భయం కలిగిస్తుంది. మాధవిలతగారి అన్నామలై గారి ఓటమి చాలా బాధాకరం ఒకరు రిగ్గింగ్,ఫత్వ, కృతఘ్నత లకి బలై పొతే అన్నామలై చుట్టుచేరి జైకొ ట్టి న వారి ఓట్లు మాత్రం DMK కి మాత్రం చేరాయి. విచిత్రం ఏమిజరిగిందో సచ్చరితుడు,యోగి,దేశ భక్తుడు, నిస్వార్ధపరుడు, అయిన మోడీజీ మన దేశ ప్రధాని గా తిరిగి మూడవసారి కూడా ఎన్నికవటం భారతీయుల కి మహా భాగ్యం దేశాభివృద్ధి అంటే దేశంలోని ప్రజలందరికి అభివృద్ధిఫలాలు అందేలా చేయటం, అంతేకాదు దేశాన్ని ఇంట బైట కూడా బలోపేతం చేయటం యిక్కడ ప్రజలందరూ సమానమే.. కుల మత బేధాలు లేకుండా అందరికి ఒకే విధమైన న్యాయం అమలు చేయటం న్యాయం .అంతేకాని మోడీజీ మాకేమి చేసారు మాకేమి ఇచ్చారు అనుకునే అజ్ఞానులని వదిలేయాల్సిందే మోడీజీ మూడవసారి ప్రధాని అయిన శుభ సందర్బం ని, మన మనసులోని బీజేపీ కి అనుకున్న సీట్స్ రాలేదనే అసంతృప్తి పక్కనపెట్టి ఆనందంగా స్వాగతం చెప్దాము.
మోడీజీ పరిపాలన లో దేశం సుభిక్షం గా ఉంటుంది యింకా ఉన్నతి సాధిస్తుంది మోడీజీ, ప్రపంచాన్ని వూపేసిన భయంకరమైన పండమిక్ కరోనా ని, చైనా అఘాయిత్యాలను, ఆకాశానికి ఎగిరిన ఆయిల్ ధరలను ప్రతిపక్షాల దాడి ని అన్నిటిని సమర్ధంగా ఎదుర్కొని దేశం ఆర్ధిక పరిస్థితిని బలోపేతం చేసారు ప్రపంచం లో భారత్ ప్రతిష్టను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు.. అలాంటి ప్రధాని యిప్పుడు యింకా సమర్ధవంతంగా తన కర్తవ్యంపాటిస్తారు. దేశాన్ని మందుకు నడిపిస్తారు . ముచ్చటగా మూడవసారి ఈ భారత ద్వీపకల్పానికి అశేష ప్రజానీకానికి ప్రధాని కాబోతున్న శ్రీ నరేంద్ర మోడీజీ గారికి శుభాకాంక్షలు హార్దిక అభినందనలు.