చర్చలకు పిలిచే న్యూస్ ఛానల్లకు నిజమైన మేథావులు దొరకటం లేదా? ఇంకా ఆ నాగేశ్వరరావును మేథావి అనుకుంటూ ఉన్నారా?
1984లో 543 లోకసభ స్థానాల్లో కాంగ్రెస్‌కు 404, ప్రతిపక్ష TDPకి 30 స్థానాలు రాగా, C మాధవ రెడ్డి 1984లో టీడీపీ తరపున అదిలాబాద్ నుంచి గెలిచిన వీరిని, లోకసభలో పార్టీ నాయకుడిగా NTR నిర్ణయించారు. మాధవ రెడ్డి గారికి ఫ్లోర్ లీడర్ హోదా తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు.
ఇక నిన్నటి నుంచి మేథావులంతా నమ్మేలా చెప్పిన(నాతో సహా ఎంతోమంది అదే ఈ క్షణం వరకు నమ్మారు కూడా) అలనాటి ప్రతిపక్ష నేత పర్వతనేని ఉపేంద్ర 1984 నుంచి 1990 వరకు TDP రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, 1990లో మరలా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు, కాని ఆ తర్వాత 1996 లో కాంగ్రెస్‌లో జాయినయ్యారు! 2009లో ప్రజారాజ్యంలో జాయినయ్యారు, 2009లో శివైక్యం చెందారు.
కాబట్టి పెద్దలు, మేథావులనుకుంటున్న నాగేశ్వరరావు గారు, వాస్తవాలను వక్రీకరించి , సోషల్ మీడియా, టీవీలలో 1984లో లోకసభలో ప్రతిపక్ష హోదా ఇచ్చారని చెప్పటం దారుణం. అంతెందుకు 2014, 2019 లో కాంగ్రెస్ కు 55 సీట్లు రాలేదని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే నిజాన్ని దాయటం వారి విచక్షణకు వదిలేసి నేడు రాహుల్‌గాంధీకి ప్రతిపక్ష నేత హోదా ఎందుకు ఇచ్చారో మరోమారు అందరినీ ఆలోచించమని మనవి!
సభ్యత, సంస్కారం, వినయం, విధేయత, విజ్ఞానం, విషయపరిజ్ఞానం, మేధావితనం, తెలివి, ఆలోచనా, సమయస్ఫూర్తి ఇవన్నీ వయసుతో మాత్రమే వచ్చేవి కావని ఇప్పటికైనా అంతా తెలుసుకోవలన్నాధే నా తపన.