ప్రధాని పర్యటన వేళ ఇటలీలో భారత్ కు ఘోర అవమానం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ జీ 7 సదస్సులో పాల్గొనేందుకు గురువారం (జూన్ 13) ఇటలీ పర్యటనకు వెడుతున్న సంగతి తెలిసిందే.
సరిగ్గా ఈ సమయంలో ఖలిస్థాన్ సానుభూతి పరులు ఇటలీలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ సందర్భంగా కెనడాలో హత్యకు గురైన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్కు అనుకూలంగా నినాదాలు చేశాడు.
ఘటన జరిగిన వెంటనే అధికారులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని భారత రాయబార కార్యాలయం డిమాండ్ చేసింది.